నవతెలంగాణ – పెద్దవంగర
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ పార్టీ శ్రేణులు పెద్దవంగర లో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ జెండాలతో పాటుగా నల్ల రంగు బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ చౌరస్తా తొర్రూరు-వలిగొండ ప్రధాన రహదారిపై బైఠాయించారు.
రాస్తారోకో నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు బీఆర్ఎస్ నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించి, అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామచంద్రయ్య శర్మ తో కలిసి ఐలయ్య మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లకు సిట్ నోటీసులు జారీ చేయడం ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, కనుకుంట్ల వెంకన్న, జ్ఞానేశ్వర చారి, సుధీర్, హరీష్, షర్ఫిద్దీన్, యాకయ్య, రాంమూర్తి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.



