నవతెలంగాణ – ఆలేరు టౌను
ఆలేర్ పట్టణంలో రైల్వే గేట్ వద్ద, అండర్ పాస్ నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ, ఆలేరు బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అండర్‌పాస్ సగభాగం పూర్తయ్యాయని గుర్తు చేశారు. ఆర్‌వోబీ నిర్మాణంతో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు 100 గజాల స్థలాలు కేటాయించామని, నష్టపరిహారం అందించామని తెలిపారు. అయితే, ప్రస్తుత ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో వంద రోజుల్లో పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చినా, ఇప్పటికీ ఆర్‌వోబీ పనులు అసంపూర్తిగానే ఉన్నాయని విమర్శించారు.
వెంటనే నిర్మాణ పనులు పూర్తి చేయాలని, లేనిపక్షంలో రోజూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు కోమల్ల మౌనిక హరీష్, యాట శివ బీజనా కళ్యాణి మధు మాట్లాడుతూ.. అండర్ పాస్ నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. పట్టణంలో పేరుకుపోయిన పనులు వెంటనే ప్రారంభించాలని, కలిసికట్టుగా పనిచేసే ఆలేరు అభివృద్ధికి పాటు పాడుదాం అన్నారు. ఈ ధర్నాలో పార్టీ నాయకులు వస్పరి శంకరయ్య, కొల్పుల హరినాథ్, మొరిగాడి మాధవి వెంకటేష్, కుండే సంపత్, జూకంటి ఉప్పలయ్య, పాషికంటి శ్రీనివాస్, ఆడెపు బాలస్వామి, బేతి రాములు, మాదాన్ని ఫిలిప్, జల్లి నరసింహులు, గాదపాక నాగరాజు, సరాపు సంతోష్, నీలపెళ్లి కవిత, పయజు పార్టీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



