Sunday, May 4, 2025
Homeతెలంగాణ రౌండప్మేడారంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుని జన్మదిన వేడుకలు

మేడారంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుని జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ -తాడ్వాయి : బీఆర్‌ఎస్‌ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు జన్మదిన వేడుకలను శనివారం మేడారంలో వనదేవతల సన్నిధిలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు దండగల మల్లయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వన్నదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేక్ కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షురాలు గడ్డం అరుణ, మాజీ సర్పంచ్,  చిన్నక్క, యూత్ నాయకులు  సురేష్, పత్తి గోపాల్ రెడ్డి, రఫీక్, జీడి బాబు, సతీష్, లక్ష్మణరావు, గజ్జల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -