Sunday, October 26, 2025
E-PAPER
Homeఖమ్మంఘనంగా బిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ: రేగా కాంతారావు 

ఘనంగా బిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ: రేగా కాంతారావు 

- Advertisement -

నవతెలంగాణ – మణుగూరు
మణుగూరు మండల కేంద్రంలోని తెలంగాణ భవన్ ప్రాంగణంలో భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం పార్టీ యొక్క ఎజెండా, భవిష్యత్ ప్రణాళికలపై విలువైన సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మణుగూరు మండల అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు, టౌన్ అధ్యక్షులు కుంట లక్ష్మణ్ , సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి పోశం నరసింహారావు, వట్టం రాంబాబు , మాజీ మండల అధ్యక్షులు, ముత్యం బాబు, అక్కి నరసింహారావు, నూకాల రమేష్ , గంధం తడిక మల్ల ప్రభుదాస్ మరియు మణుగూరు మండలం బి ఆర్ ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు బోలిశెట్టి రవి ప్రసాద్  మరియు మణుగూరు టౌన్ యూత్ అధ్యక్షులు గుర్రం సుజన్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -