- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గం భేటీ ఆదివారం తెలంగాణ భవన్‌లో జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. సమావేశంలో పార్టీ శ్రేణులకు భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
- Advertisement -



