Tuesday, March 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంముస్లిం సోదరులకు బీఆర్‌ఎస్‌ ఇఫ్తార్‌ విందు

ముస్లిం సోదరులకు బీఆర్‌ఎస్‌ ఇఫ్తార్‌ విందు

- Advertisement -

కేటీఆర్‌ హాజరు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

రంజాన్‌ పండుగను పురస్కరించుకుని బీఆర్‌ఎస్‌ పార్టీ ముస్లిం సోదరులకు సోమవారం తెలంగాణ భవన్‌లో ఘనంగా దావత్‌-ఏ- ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా ఆపార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, తనను ఆహ్వానించిన బీఆర్‌ఎస్‌ మైనార్టీ నేతలకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని మైనార్టీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చలేదని ఈ సందర్భంగా విమర్శించారు. మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రకటించిన డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మైనార్టీల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -