Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్బీఆర్‌ఎస్‌ ఒక ఉద్యమ, ప్రజల పార్టీ 

బీఆర్‌ఎస్‌ ఒక ఉద్యమ, ప్రజల పార్టీ 

- Advertisement -

ఈనెల 14న బీసీ కధనబేరి సభ విజయవంతం చేయండి
మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ 
నవతెలంగాణ – కరీంనగర్ 

ఈనెల 14వ తేదీన కరీంనగర్‌ లో నిర్వహించే బీసీ కధనబేరి సభ  విజయవంతం చేయాలని మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ పిలుపునించారు. మంగళవారం  కరీంనగర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరీంనగర్‌ నియోజకవర్గంలోని బిఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నాయకులతో  సమావేశం ఏర్పాటు చేశారు. కార్యకర్తలకు, నాయకులకు గంగుల కమలాకర్‌ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ..బీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అయిందన్నారు. సమృద్ది సాగునీరు, త్రాగునీరు అందించామన్నారు. పాడిపంటలు పండాయన్నారు. తెలంగాణలో రేవంత్‌ ప్రభుత్వంపై  ప్రజావ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రజాపక్షంలో ఉంటూ ప్రజలకు అండా నిలువాల్సిన అవసరముందన్నారు.

ఈ నెల 14న   తలపెట్టిన బీఆర్‌ఎస్‌  బీసీ కధనబేరి సభ ను సక్సెస్‌ చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ ఒక ఉధ్యమ పార్టీ, ప్రజల పార్టీ అన్నారు.  బీసీలను 42 శాతం రిజర్వేషన్‌ పేరిట కాంగ్రెస్‌  డ్రామా ఆడుతుందన్నారు. కాంగ్రెస్‌ చేసిన ద్రోహాన్ని ప్రజల్లో నిగ్గు చేర్చాలని పిలుపునిచ్చారు. బీసీలకు రాజ్యాదికారం రావాలని అన్నారు. అందుకే  బీసీ కథనబేరి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్‌లో ఈ నెల 14న  నిర్వహించనున్న  బీఆర్‌ఎస్‌  బీసీ గర్జన సభ లో సీఎం రేవంత్‌ రెడ్డిని, కాంగ్రెస్‌ ప్రభుతాన్ని నిలదీస్తామన్నారు.  కేసిఆర్‌ పాలనలో బీసీలకు అన్ని విధాలుగా ప్రాధాన్యతనిచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అభివృద్ధి కోసం ఎక్కడా తట్టెడు మట్టి పోసింది లేదన్నారు. అభివృద్ది పనులు చేపట్టలేదన్నారు. కాళేశ్వరం తెలంగాణ వరప్రధాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీరు రాక మిడ్‌ మానేరు, ఎల్‌ఎండి ఎండిపోయిందన్నారు.

సాగునీరు, త్రాగునీరు లేక తల్లడిల్లి పోతున్నారన్నారు. అందుకే ప్రజావ్యతిరేక రేవంత్‌ ప్రభుత్వాన్ని కడిగిపారేయాలన్నారు. ఈ సమావేశానికి  బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి  కేటిఆర్‌ రానున్నారన్నారు.  నియోజకవర్గంనుండి సుమారు పదివేల మందికి తగ్గకుండా సభకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తో పాటు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బిఆర్‌ఎస్‌ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్‌ , కరీంనగర్‌ బిఆర్‌ఎస్‌ పార్టీ మండల శాఖ అధ్యక్షులు పెండ్యాల శ్యాంసుందర్‌ రెడ్డి, కొత్తపల్లి మండల పార్టీ అధ్యక్షులు కాసరపు శ్రీనివాస్‌ గౌడ్‌, మాజీ ఎంపీపీ లు పిల్లి శ్రీలత-మహేష్‌, తిప్పర్తి లక్ష్మయ్య, మాజీ జడ్పీ కోఆప్షన్‌ సభ్యులు జమీలుద్దీన్‌, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు, పార్టీ డివిజన్‌ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు , పార్టీ కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు.. తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img