Sunday, February 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గోలనుకొండ గ్రామాల సమగ్రాభివృద్ధికి బీఆర్ఎస్ కట్టుబడి ఉంది

గోలనుకొండ గ్రామాల సమగ్రాభివృద్ధికి బీఆర్ఎస్ కట్టుబడి ఉంది

- Advertisement -

గొంగిడి మహేందర్ రెడ్డి
నవతెలంగాణ – ఆలేరు రూరల్

గోలనుకొండ గ్రామాల్లో సమగ్రాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ కట్టుబడి ఉందని మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. ఆలేరు మండలం గోలనుకొండ గ్రామంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఇండిపెండెంట్‌గా సర్పంచ్ పదవికి పోటీ చేసిన నవీన్  గౌడ్ సుమారు 100 మంది అనుచరులతో కలిసి ఆదివారం గొంగిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో  చేరారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..  ప్రత్యర్థి పార్టీల అసమర్థత, అభివృద్ధి పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించడం వల్లే ప్రజలు వారిపై విశ్వాసం కోల్పోయారని ఆయన విమర్శించారు.అభివృద్ధి చేయలేని వారు, స్పష్టమైన నాయకత్వం ఇవ్వలేని వారు ప్రజల్లో నిలబడలేరని పేర్కొన్నారు.

నవీన్ గౌడ్ చేరికతో గోలనుకొండలో బిఆర్ఎస్ పార్టీ మరింత బలపడిందని అన్నారు. గోలనుకొండ గ్రామంలో అభివృద్ధి వేగాన్ని మరింత పెంచేందుకు బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తాం. గ్రామ ప్రజలు ఇప్పుడు పనికొచ్చే నాయకత్వాన్ని ఎంచుకుంటున్నారు అని స్పష్టం చేశారు.నవీన్  గౌడ్ మాట్లాడుతూ, గ్రామ ప్రయోజనాల కోసం కట్టుబడి పనిచేసే శక్తి బిఆర్ఎస్ పార్టీకే ఉందని విశ్వసించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలకు అండగా నిలిచి అభివృద్ధి దిశగా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ చేరికతో గోలనుకొండలో బిఆర్ఎస్ ప్రభావం మరింత బలపడిందని, ఇకపై ప్రత్యర్థి పార్టీలకు అక్కడ స్థానం లేదని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గంగుల శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గ్యాడపాక నాగరాజు, మాజీ సర్పంచులు వడ్ల శోభన్ బాబు, కందుల శంకర్, కోటగిరి పాండరి, వార్డు సభ్యులు బాకీ రాములు, వంగాల బిక్షపతి, బాకీ హైమావతి, కొమ్మరాజుల వెంకటేష్, గ్రామ శాఖ అధ్యక్షులు బాకీ శ్రీను,యూత్ అధ్యక్షులు కొమ్మరాజుల అశోక్, పిఎసిఎస్ డైరెక్టర్ మారుపల్లి బిక్షపతి, నాయకులు శోభన్, స్వామి, కుమారస్వామి సుధీర్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -