Saturday, February 7, 2026
E-PAPER
Homeఖమ్మంబీఆర్ఎస్ తోనే స్థానిక సమస్యలు పరిష్కారం 

బీఆర్ఎస్ తోనే స్థానిక సమస్యలు పరిష్కారం 

- Advertisement -

– మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

స్థానిక తే ఎజెండా గా రూపొందిన బీఆర్ఎస్ తోనే స్థానిక సంస్థల బలోపేతం, స్థానిక సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ ఛైర్పర్సన్ అభ్యర్థిని కాసాని నాగశేషపద్మ విజయాన్ని కాంక్షిస్తూ శనివారం ఆయన 8 వ వార్డు తో పాటు పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అశ్వారావుపేట మేజర్ పంచాయతీ అభివృద్ధి చేసింది, మున్సిపాలిటీ గా ఏర్పాటు కు కృషి చేసింది నేనే నాని అయిన అన్నారు‌.మున్సిపాల్టీ గా మరింత బలోపేతం చేయడానికి బీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాసాని నాగశేషపద్మ – చంద్ర మోహన్ దంపతులు,జెడ్పీటీసీ పూర్వ సభ్యులు జేకేవీ రమణారావు – పద్మజా దంపతులు, మండల పరిషత్ పూర్వ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సంక ప్రసాదరావు,పాలవలస జీవన్ రావు,మోటూరు మోహన్, జక్కుల రాంబాబు లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -