Tuesday, March 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబీఆర్‌ఎస్‌ నేతలది చిల్లర రాజకీయాలు

బీఆర్‌ఎస్‌ నేతలది చిల్లర రాజకీయాలు

- Advertisement -

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో

అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ సభ్యులు అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. ప్రభుత్వ అద్భుతమైన పాలనను చూసి ఓర్వలేకనే బీఆర్‌ఎస్‌ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ సభా సమయాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. మచ్చలేని నాయకుడిగా పేరున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మంత్రి తమ వ్యక్తిగత పనులు చేయలేదన్న అక్కసుతో, రాజకీయ లబ్ది కోసం ఆయనపై లేనిపోని నిందలు వేస్తున్నారని విమర్శించారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన మైనింగ్‌, సాండ్‌ మాఫియా అక్రమాలపై ప్రభుత్వం సీబీ-సీఐడీ విచారణకు ఆదేశిస్తే, బీఆర్‌ఎస్‌ నేతలు భయపడి సభను అడ్డుకుంటున్నారని అన్నారు. సభలో బీఆర్‌ఎస్‌ సభ్యులు చిల్లరగా వ్యవహరిస్తున్నా, ఆ పార్టీ సీనియర్‌ నాయకులు హరీశ్‌రావు వారిని కనీసం అడ్డుకోకపోవడం వారి రాజకీయ సంస్కృ తిని తెలియజేస్తుందని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -