- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు ఇటీవలనే మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో నాయకులు తన్నీరు హరీష్ రావుని కలిసి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మండలం పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు , మాజీ ఎంపీపీ కేశపట్నం రమేష్, పిఎసిఎస్ చందుపట్ల బ్యాంక్ మాజీ చైర్మన్ బాల్గురి మధుసూదన్ రెడ్డి, నాగిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ జక్కా కవిత రాఘవేందర్ రెడ్డి , మదర్ డైరీ డైరెక్టర్ కస్తూరి పాండు, బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిలివేరు మధు, జనగాం మహేష్, కునూర్ బి ఆర్ ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు పాశం మహేష్ లు పాల్గొన్నారు.
- Advertisement -



