నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచులు కలిసి బుధవారం జుక్కల్ పోలీస్ స్టేషన్లో శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ… జుక్కల్ మండలానికి నూతనంగా వచ్చిన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిశామని తెలిపారు. మండలంలో శాంతిభద్రతలు కాపాడాలని, మండలం వెనుకబడిన ప్రాంతం కావడం, నిరుపేద కుటుంబాలు ఎక్కువగా ఉంటారు. వారికి చట్టాల గురించి ఏమి అవగాహన తెలియదని తెలిపారు. జుక్కల్ మండలానికి యంగ్ అండ్ డైనమిక్ యువ ఎస్సై రావడం మంచి శుభ సూచకమని వారు అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో నాగల్ గావ్ మాజీ సర్పంచ్ కపిల్ పటేల్ , లాడేగాం సర్పంచ్ భర్త రాజశేఖర్ పటేల్, చిన్న ఎడికి సర్పంచ్ భర్త శివాజీ పటేల్ , జుక్కల్ మాజీ ఉప సర్పంచ్ బాను గౌడ్ , తదితరులు పాల్గోన్నారు.
ఎస్సైని సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES