Friday, December 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కౌలాస్ సర్పంచ్ ను సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు

కౌలాస్ సర్పంచ్ ను సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లి గంగాధర్  ఆధ్వర్యంలో జుక్కల్ మండల కౌలాస్ సర్పంచ్ ఎంబరీ విద్యా బాలారం, ఉప సర్పంచ్ గణేష్ లకు   బిఆర్ఎస్ పార్టీ తరుపున శాలువ సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గంగాధర్ మాట్లాడుతూ.. మండలంలో పార్టీ పటిష్టత గురించి తాను ఎప్పుడు కట్టుబడి ఉండి ఉంటామని అన్నారు.

అందులో భాగంగానే మండలంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు అత్యధికంగా గ్రామ సర్పంచ్ ఎన్నికలలో గెలుపు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో  జుక్కల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు,మాజీ ఎంపీపీ బస్వంత్ రావు షెట్కర్,వాసరే రమేష్,శివాజీ పటేల్,భాను గౌడ్,రవి పటేల్,అన్వర్ భాయ్, విశ్వనాథ్, గాజు గౌడ్,కపిల్ కాంబ్లే, విట్టల్,అర్జున్ కాంబ్లే,రాజు, సాయిలు, రాజేష్, మొగలయ్య ,కిరణ్ కాంబ్లే, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,యువ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -