నవతెలంగాణ – తాడ్వాయి
హైదరాబాదులోని తన నివాసంలో మాజీ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావును శుక్రవారం ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ జెడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, మాజీ జెడ్పిటిసి రామసహాయం శ్రీనివాస్ రెడ్డి లు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగు జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి, ఇటీవల గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళు రాలేదని అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్న చుక్క రమేష్ పరిస్థితులు, ఆత్మహత్యకు గల కారణాలు గురించి, అలాగే ఏటూరు నాగారం మండలం రొయ్యూరు గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం ఆదివాసులు వేసుకున్న ఫారెస్ట్ అధికారులు గుడిసెలను కూల్చివేయడం, ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా వారి మీద పోలీసులు కేసులు పెడుతున్న తీరు, తదితర అంశాలపై హరీష్ రావుకు వివరించారు. ములుగు జిల్లాలో అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పలు ప్రజా సమస్యలను ఆయనకు విన్నవించారు.
హరీశ్ రావును కలిసిన బీఆర్ఎస్ నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES