– రూ.30 వేల విలువైన నిత్యావసర వస్తువుల అందజేత
నవతెలంగాణ – అశ్వారావుపేట
అగ్ని ప్రమాదానికి గురై సర్వం కోల్పోయిన ఒక కుటుంబానికి బీ ఆర్ఎస్ నాయకులు అండగా నిలిచారు.రూ.30 వేల విలువైన నిత్యావసర వస్తువులను బాదితులకు మంగళవారం అందజేసారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలోని కోయిరంగాపురం కు చెందిన కారం మల్లయ్య కచ్చా గృహం సోమవారం విద్యుత్ ఘాతం కారణంగా దగ్ధం అయింది.
ఆ విషయా పార్టీ స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న మండల నాయకులు మంగళవారం కోయి రంగాపురం చేరుకుని బాధితులను పరామర్శించారు. రూ. 30 వేల విలువైన నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందించారు. మండల పరిషత్ పూర్వ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామ మూర్తి స్ధానిక ఎమ్మెల్యే ఆదినారాయణ కు చరవాణి ద్వారా సమాచారం తెలియజేసి తక్షణమే ఈ ఇళ్ళు కాలిన బాధితులకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేసి,తక్షణ సహాయం చేయాలని కోరారు.సానుకూలంగా స్పందించిన ఆయన తప్పనిసరిగా అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తామనీ హామీ ఇచ్చారు.
అనంతరం తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ కు సమాచారం తెలియజేసి ఇళ్ళు కాలిన బాధితులకు ప్రభుత్వం తరపున వచ్చే సహాయాన్ని త్వరగా ఇచ్చేలా చూడాలని వారిని కోరారు. జడ్పీటీసీ మాజీ సభ్యులు చిన్నంశెట్టి వరలక్ష్మీ వెంటక నరసింహం రూ. 5 వేలు,జూపల్లి కోదండ రమణ రావు రూ. 5 వేలు ఆర్థిక సహాయం చేశారు. పార్టీ గుమ్మడివల్లి నాయకులు నిత్యవసర సరుకులు,కొంత నగదు సహాయం చేశారు.
మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరావు బాధితుల తో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు.నేను వేరే కార్యక్రమం పై బయట ప్రాంతానికి వెళ్లడం జరిగింది అని, వచ్చిన వెంటనే మీ దగ్గరికి వస్తాను అని ఫోన్ ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సోడెం చిన్న గంగమ్మ,ఎంపీటీసీ మాజీ సభ్యుడు తిరుపతి రావు, మండల నాయకులు సంక ప్రసాద్,కాసాని చంద్రమోహన్, డాక్టర్ భూక్యా ప్రసాద్,జజ్జూరి శ్రీరామమూర్తి, పాలవలస జీవన్ రావు, చందా లక్ష్మీ నర్సయ్య,పుట్ట సత్యం,డేరంగుల కురేశు తుమ్మల నాగేశ్వర రావు,సీతా రాముడు పాల్గొన్నారు.




