నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలం నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గ్రామీణ స్థాయి నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు , మాజీ సర్పంచులు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ సొసైటీ చైర్మన్లు, భారీగా బిచ్కుందకు కేటీఆర్ రోడ్ షోకు తరలివచ్చారు. ఈ సందర్భంగా జుక్కల్ మండల కేంద్రం నుండి ప్రారంభమైన ర్యాలీ కందర్పల్లి వరకు భారీగా వెళ్లడంతో కాంగ్రెస్ వర్గాలలో గుబులు మొదలైంది. ఎక్కడ చూసినా బీఆర్ఎస్.. బీఆర్ఎస్.. నినాదాలతో మార్ములోకి పోయింది. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ గురించి ఒకరికి ఒకరు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోవడమే కాంగ్రెస్ పార్టీకి గండం వచ్చి పడిందని ప్రజలు అంటున్నారు. రోడ్ షోకు భారీగా జనం తరిలి రావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండలం నుండి 30 గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాల బీఆర్ఎస్ నాయకులు తగిలి వెళ్లారు.
కేటీఆర్ రోడ్ షో కు భారీగా తరలిన బీఆర్ఎస్ నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



