నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని చల్వాయి గ్రామానికి చెందిన కారపాటి కృష్ణ నివాస గృహము ఇటీవల కురుస్తున్న వర్షాలకు వరద నీరు చేరడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండగా బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం పరామర్శించి భరోసా అందించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లాకావత్ నరసింహ నయక్ మాట్లాడుతూ చల్వాయి గ్రామంలో
కృష్ణ భార్య ఇద్దరు పిల్లలతో చాలీసాలని నివాస గహంలో కాపురం చేస్తుండగా విస్తారంగా కురస్తున్న వర్షాల వల్ల ఇంట్లోకి వరద నీరు రావడం శోచనీయం అన్నారు. వర్షాలు ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏంటని కృష్ణ ఆందోళన చెందుతున్న తరుణంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించడం జరిగిందన్నారు
కావున ఇప్పటికైనా అధికారులు ఇలాంటి నిరుపేద కుటుంబాలను గుర్తించి వీరికి తక్షణమే ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని టిఆర్ఎస్ పార్టీ తరఫున మండల పార్టీ అధ్యక్షులు లాకావత్ నరసింహ నాయక్ కోరారూ. ఈ కార్యక్రమంలో మచ్చాపూర్ మాజీ సర్పంచ్ రేగుల రవీందర్ రెడ్డి చల్వాయి మాజీ వార్డ్ నెంబర్ రామ్ రెడ్డి మండల ఉపాధ్యక్షుడు చుక్క గట్టయ్య రేండ్ల శ్రీనివాస్ గూడూరు శీనుపూర్ణచందర్ బై కానీ ఓదేలు బొల్లం ప్రసాద్ కుమ్మరి వెంకన్న గోదా కనకయ్య కుర్సపల్లి విజయ్ గజ్జల రంజిత్ చింతమల రమేష్ రఘువీర్ టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.