- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫామ్ హౌస్ లో ప్రమాదవశాత్తు కాలుజారి పడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని బుధవారం మోహినాబాద్ ఫామ్ హౌస్ లో భువనగిరి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జనగం పాండు ఆధ్వర్యంలో కలిసి, పరమర్శించారు. ఈ నేనథ్యంలో త్వరగా కోలుకోవాలని యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాదారం రాము కుమార్, పట్టణ నాయకులు సిరిపంగ సుభాష్, బోనగిరి మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు పల్లపాటి రవికుమార్ లు పాల్గొన్నారు.
- Advertisement -