- Advertisement -
నవతెలంగాణ – కాటారం
కాటారం మండలం రేగులగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని గోపాల్‌పూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన దుర్గం లచ్చయ్య కుటుంబాన్ని గురువారం బీఆర్‌ఎస్ నాయకులు పరామర్శించారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గారి ఆదేశాల మేరకు నాయకులు మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి అండగా నిలుస్తూ 25 కిలోల బియ్యం బస్తా అందజేశారు. ఇలాంటి కష్టసమయంలో పార్టీ తరఫున ఎప్పుడూ అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు రాజబాబు, జనగాం నేత గాజుల విక్రమ్, కామిడీ ప్రమోద్, జనగాం సడవలి, సెగ్గం రవి, కుసుమ బానయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



