Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కన్నుమూత..

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కన్నుమూత..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: బీఆర్ఎస్‌ కు చెందిన జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ (62) కన్నుమూశారు. ఈనెల 5న (గురువారం) ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5.45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు వైద్యులు వెల్లడించారు.
ఈనెల 5న ఇంట్లో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఏఐజీకి తరలించారు. కార్డియాక్‌ అరెస్టుకు గురైనట్లు వైద్యులు తెలిపారు. సీపీఆర్‌ చేయడంతో తిరిగి గుండె కొట్టుకోవడం, నాడి, బీపీ సాధారణ స్థితికి రావడంతో… ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగించారు. కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం కూడా ఏఐజీలో చేరారు. అప్పట్లో డయాలసిస్‌ చేయించుకున్నట్లు సమాచారం. తాజాగా గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ మృతిచెందారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img