Monday, January 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా సమస్యల పరిష్కారం కొరకు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ గొంతుక వినిపిస్తున్నారు

ప్రజా సమస్యల పరిష్కారం కొరకు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ గొంతుక వినిపిస్తున్నారు

- Advertisement -

మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత 
నవతెలంగాణ – ఆలేరు టౌను

ప్రజా సమస్యల పరిష్కారం కొరకు, శాసనసభ సమావేశాలలో బిఆర్ఎస్ శాసనసభ్యులు, తమ గొంతుక వినిపిస్తున్నారని మాజీ ప్రభుత్వ విప్పు ఆలేరు మాజీ శాసన సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఆలేరు పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అనేక అబద్దాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటికీ ప్రజల్ని వంచించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. శాసనసభ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధి కొరకు, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ,మంత్రులకు, శాసనసభ్యుల తో  బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చిస్తా ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా , మాట్లాడినంత సేపు అబద్ధాలు  మాట్లాడుతున్నారని, వెనకాల కూర్చున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఎమ్మెల్యేలు, అభ్యర్థులను గెలిపించుకునేందుకు, కొత్త పెన్షన్లు , రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వమని, బెదిరించి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు.

బిఆర్ఎస్ అభ్యర్థులను అనేక చోట్ల గెలిపించుకొని, నియోజకవర్గంలో 48 శాతం ఓటు బ్యాంకు సాధించామన్నారు. నియోజకవర్గంలో 78 స్థానాలలో గెలిచామని చెప్పారు. ఇది బిఆర్ఎస్ కార్యకర్తల పట్టుదల, సంకల్పమని, ప్రభుత్వం చేస్తున్నా అరాచకాలకు ఎదురొడ్డి పోరాడారని పేర్కొన్నారు. బెదిరింపులకు బి ఆర్ఎస్ పార్టీలో ఉన్నదని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుందన్నారు. ప్రజల పక్షాన నిలబడి , ప్రజలకు న్యాయం చేసే విధంగా, ధర్మంగా పోరాటం చేసి ఏ ఎన్నిక వచ్చిన  అన్ని స్థానాలలో  గెలిచి తీరుతామన్నారు.

బెదిరింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ,  రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. తగు చర్యలు కోరుతామన్నారు. వాసాలమర్రిలో గెలిచిన అభ్యర్థిని, గెలుపొంద లేదని చెప్పిన, ఘనత కాంగ్రెస్ పార్టీకి , ఇక్కడ ఎమ్మెల్యేకు చెందుతుందని చెప్పారు. నీ కుట్రలు కూతంతురాలకు పాల్పడిన ప్రజలు  బి ఆర్ ఎస్ వెంటే ఉంటారని దీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో  మాజీ జెడ్పిటిసి బోట్ల పరమేశ్వర్ , మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య , పిఎసిఎస్ మాజీ వాయిస్ చైర్మన్ చింతకింది చంద్రకళ మురారి,టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేశం , పోరెడ్డి శ్రీనివాసు, ఆడేపు బాలస్వామి, జూకంటి  శ్రీకాంత్, ఎం డి మాజార్, అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -