Monday, March 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

- Advertisement -

పాడి కౌశిక్‌రెడ్డిపై ఎథిక్స్‌ కమిటీకి సిఫారసు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ సస్పెండ్‌ చేశారు. సభా కార్యక్రమాలను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారనీ, వారిని సస్పెండ్‌ చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో కేటీఆర్‌, హరాష్‌రావు సహా ఆపార్టీ ఎమ్మెల్యేలను రెండు రోజులపాటు సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. సస్పెన్షన్‌కు గురైనవారిలో తలసాని శ్రీనివాస్‌యావ్‌, గుంతకండ్ల జగదీష్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, మాధవరం కృష్ణారావు, బండారు లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, మాణిక్‌రావు,పద్మారావు, చింతా ప్రభాకర్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్‌, విజయుడు, కెపి వివేకానంద, అనిల్‌జాదవ్‌, కోవా లక్ష్మి ఉన్నారు. కడియం శ్రీహరిని తన హవభావాలతోపాటు బాడీ ల్యాంగేజ్‌ ద్వారా అవమానించినందుకు కఠిన చర్యలు తీసుకునేందుకు ఎథిక్స్‌ కమిటీకి సిఫారసు చేయాలంటూ సభ తీర్మానించింది. కాగా ఈ ప్రభుత్వంలో అసెంబ్లీ నుంచి గుంతకండ్ల జగదీష్‌రెడ్డి సస్పెండ్‌ కావడం ఇది రెండోసారి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -