Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్26న బీఆర్ఎస్ సన్నాహక సమావేశం 

26న బీఆర్ఎస్ సన్నాహక సమావేశం 

- Advertisement -

బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 29న నిర్వహించనున్న దీక్ష దివాస్ ను విజయవంతం చేయడానికి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నవంబర్ 26న సన్నాహక సమావేశ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజు నవంబర్ 29 అని, తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో అన్న నినాదమే ఉద్యమానికి ఊపిరి పోసిందని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు సాధనలో కీలకమైన కేసీఆర్ ఆమరణ దీక్ష దివస్ ఘనంగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించేందుకు ఈ సన్నాహక సమావేశం నిర్వహిసున్నట్లు ఆయన వివరించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -