నవతెలంగాణ-పెద్దవూర: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా పట్టణంలో కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో సోమవారం నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను తెలిపారు.ఈసందర్బంగా నోముల భగత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారని అన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ఒకపక్క యూరియా కొరతతో రైతులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతుంటే, మరోపక్క కాలేశ్వరం కమిషన్ పేరుతో కెసిఆర్ ను ఇబ్బంది పెట్టాలనె దురుద్దేశంతో సిబిఐ కి అప్ప చెప్పడాన్ని తక్షణమే విరమించుకోకపోతే బిఆర్ఎస్ పార్టీ నాగార్జునసాగర్ నియోజకవర్గం తోపాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
నల్ల బ్యాడ్జిలతో నిరసన బీఆర్ఎస్…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES