Monday, February 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నిరసనలు

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నిరసనలు

- Advertisement -

– సీఎం దిష్టిబొమ్మలు దహనం, రాస్తారోకోలు, ధర్నాలు
– పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు
నవతెలంగాణ – విలేకరులు

రాజకీయ కక్షతోనే కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు జారీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని సీఎం దిష్టిబొమ్మలు దహనం చేశారు. ర్యాలీలు, ధర్నాలు చేశారు. ఈ క్రమంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హనుమకొండ జిల్లా బాలసముద్రం నుంచి ఎంజీఎం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిరసనకారులతో పాటు మాజీ విప్‌ వినరు భాస్కర్‌ను అరెస్టు చేసి మట్టెవాడ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఖమ్మం జిల్లా బోనకల్‌లోని ఖమ్మం బస్టాండ్‌ సెంటర్‌లో రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించి సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దాంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు దిష్టిబొమ్మను లాక్కొని వెళ్లడంతో దహనం చేయకుండానే నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్‌ ఆధ్వర్యంలో నాయకులు రోడ్డుపై బైటాయించి ధర్నా చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షులు మెతుకు ఆనంద్‌ ఆధ్వర్యంలో ధర్నా చేయగా పోలీసులు అడ్డుకున్నారు.
నల్లగొండ పట్టణంలో బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని గడియారం సెంటర్‌ వద్దకు పోకుండా పోలీసులు అడ్డుకోవడంతో పెనుగులాట జరిగింది. దాంతో బీఆర్‌ఎస్‌ నేతలు రోడ్డుపై బైటాయించారు. నల్లగొండ ఇన్‌చార్జి డీఎస్పీ రవి, సీఐలు ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, రాఘవరావు, టూటౌన్‌ ఎస్‌ఐ సైదులు సర్ది చెప్పడంతో అక్కడితో ర్యాలీ ముగించి వెళ్లిపోయారు.

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా.. పోలీసులు లాక్కొని పోలీస్‌ వ్యాన్‌లో వేశారు. దీంతో పోలీసులకు, బీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య తోపులాట జరిగింది. పలువురు బిఆర్‌ఎస్‌ నాయకులను అరెస్టు చేసి నాలుగో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆర్మూర్‌ పట్టణంలో బీఆర్‌ఎస్‌ ర్యాలీలో దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి తోపులాటలో స్పృహ తప్పి పడిపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని నియంత్రించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -