కాంగ్రెస్ పార్టీ నాయకులు మండ్ల దేవన్న నాయుడు
నవతెలంగాణ – వనపర్తి
యూరియా కొరతపై మాజీ మంత్రి, బి ఆర్ ఎస్ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, ఐదేళ్లు మంత్రిగా పనిచేసిన యూరియా ఎక్కడి నుంచి వస్తదో తెలియదా అని కాంగ్రెస్ నాయకులు మండ్ల దేవన్ననాయుడు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న రోజులన్నీ యూరియా కొరత లేదా చెప్పాలని, మీరు మంత్రిగా ఉన్న బంగారు తెలంగాణ పరిపాలనలోనే యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడి రైతు చనిపోయాడని గుర్తు చేశారు. ఆ చనిపోయిన రైతును చూసి కూడా అహంకారంతో సినిమా టికెట్లు కొన్న ప్రేక్షకుడితో పోల్చి ఆ రైతును అవమానించారని తెలిపారు.
తమరి పాలనలోని ఇబ్బందులను గుర్తుకు తెచ్చుకోవాలని, కేంద్రం అందించాల్సిన యూరియా తెలంగాణకు సరిపడా యూరియాను ఎందుకు అందించడం లేదో, బీజేపీని ఎందుకు నిలదీయడం లేదో చెప్పాలని బిఆర్ఎస్ నాయకులు తెలపాలన్నారు. వనపర్తి నియోజకవర్గం లో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆధ్వర్యంలో యూరియా అందుబాటులో ఉందని వనపర్తి బిఆర్ఎస్ సింగిల్ విండో అధ్యక్షుడు పెద్దగూడెంలో రెండు వందల యాభై బస్తాలు స్టాక్ ఉందని చెప్పాడన్నారు. కేంద్రం తెలంగాణపైన కక్ష సాధింపు చర్యలుకు దిగుతుంటే బీఆర్ ఎస్ ఆనందాన్ని వ్యక్తం చేస్తుందని విమర్శించారు. ఇప్పటివరకు కేంద్రంపైన నోరు విప్ప డం లేదన్నారు. సీఏం రేవంత్‌రెడ్డి గత నెల రోజులుగా కేంద్రాన్ని సరిపోయేంత యూరియా ఇవ్వాలని లేఖలు రాశారని, రైతులు ఆందోళన చెందవద్దని ఆయన ఈ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.
యూరియా కొరతపై బీఆర్ఎస్ సన్నాయి నొక్కులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES