Monday, February 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ రెండవ విడతా జాబితా విడుదల 

బీఆర్ఎస్ రెండవ విడతా జాబితా విడుదల 

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాల మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తన అభ్యర్థుల ఎంపికలో దూకుడు ప్రదర్శిస్తోంది. మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి సోమవారం రెండో విడత అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించారు. మొదటి విడతలో ఇప్పటికే కొన్ని స్థానాలను ఖరారు చేయగా.. తాజాగా 8 వార్డులకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను చల్లా ధర్మారెడ్డి వెల్లడించారు. సామాజిక సమీకరణాలు, పార్టీ పట్ల విధేయతను పరిగణనలోకి తీసుకుని ఈ ఎంపిక జరిగినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

రెండో విడత బీఆర్ఎస్ అభ్యర్థుల వివరాలు:

వార్డుల వారీగా బరిలో నిలిచే అభ్యర్థులు వీరే:
02వ వార్డు: బొచ్చు శ్యామల బాబురావు, 08వ వార్డు: ఆడప రాము,14వ వార్డు: పడిదెల దీప్తి రాకేష్ రావు, 15వ వార్డు: కందుకూరి వేణుగోపాలమూర్తి, 16వ వార్డు: బండి సారంగపాణి, 18వ వార్డు: రేగూరి కరుణ విజయపాల్ రెడ్డి,19వ వార్డు: ఏకు బాబు (బొబ్బిలి),20వ వార్డు: పాలకుర్తి గోపి లను చల్లా ధర్మారెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. అభ్యర్థుల ప్రకటనతో పరకాలలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. మిగిలిన వార్డుల అభ్యర్థులను కూడా త్వరలోనే వెల్లడించనుట్లు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -