Tuesday, March 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంస్పీకర్‌కు బీఆర్‌ఎస్‌ ప్రయివేటు బిల్లు నోటీసు

స్పీకర్‌కు బీఆర్‌ఎస్‌ ప్రయివేటు బిల్లు నోటీసు

- Advertisement -

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రయివేటు సభ్యుడి బిల్లుకు సంబంధించిన నోటీసును స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అందజేశారు. ఈ ప్రయివేటు మెంబర్‌ బిల్లుతో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంటుందని కేటీఆర్‌ వెల్లడించారు. అత్యంత కీలకమైన ఈ బిల్లులను ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి అనుమతించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్‌తోపాటు అసెంబ్లీ కార్యదర్శికి బిల్లుకు సంబంధించిన నోటీసులు అందజేశారు. కేటీఆర్‌ వెంట జగదీష్‌రెడ్డి, మల్లారెడ్డి, కేపీ వివేకానంద, సుధీర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, చింతా ప్రభాకర్‌, అనిల్‌జాదవ్‌, మాణిక్‌రావు, దాసోజు శ్రవణ్‌కుమార్‌, శంభీపూర్‌ రాజు, మాదవరం కృష్ణారావు, కల్లకుంట్ల సంజయ్, కౌశిక్‌రెడ్డి తదితర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -