• మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య
నవతెలంగాణ -పెద్దవంగర
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య అన్నారు. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని సూచించారు. బీఆర్ఎస్ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్, ఉపాధ్యక్షుడు వెంకన్న, నాయకులు సుధీర్, రఘు, సమ్మయ్య, వెంకట్రామయ్య, గంగాధర్, రాంమూర్తి, రాజేందర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



