– పోస్టర్‌ను ఆవిష్కరించిన తలసాని, దాసోజు, డాక్టర్ సంజరుబాబు, మహేశ్ బిగాల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జూన్ 2న అమెరికాలోని డల్లాస్‌లో జరిగే బీ ఆర్ ఎస్ రజతోత్సవ వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ,ఎమ్మెల్యే డాక్టర్ కె.సంజరు, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్, బీఆర్‌ఎస్ గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ సెల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల, చందు తాళ్ల, అభిలాష్ రంగినేని, పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ..డల్లాస్‌లో జరిగే సభకు కేటీఆర్ హాజరవుతారని తెలిపారు. అమెరికాతో పాటు యూకే, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలు చేయడం మంచి పరిణామం అని చెప్పారు.
జూన్ 2న డల్లాస్‌లో బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES