Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుయూరియా కొరతపై బీఆర్‌ఎస్‌ హల్‌చల్‌

యూరియా కొరతపై బీఆర్‌ఎస్‌ హల్‌చల్‌

- Advertisement -

గన్‌పార్కు వద్ద ఖాళీ సంచులతో నిరసన
వ్యవసాయ శాఖ కమిషనరేట్‌
వద్ద ధర్నాలో కేటీఆర్‌
సచివాలయ ముట్టడికి హరీశ్‌రావు యత్నం
అడ్డుకున్న పోలీసులు- నేతల అరెస్ట్‌
నవతెలంగాణ-సిటీ/ స్టేట్‌ బ్యూరో/హిమాయత్‌నగర్‌

రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర నిరసన తెలిపింది. అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద ఖాళీ యూరియా సంచులతో నిరసన వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు, టీ హరీశ్‌రావుతో పాటు ఆపార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అనంతరం అసెంబ్లీకి హాజరయ్యారు. బీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ వద్ద కేటీఆర్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ‘గణపతి బొప్పా మోరియా.. యూరియా ఏదయా…?’ అంటూ నినాదాలు చేశారు.

ఎరువుల కొరతపై శాసనసభలో చర్చించి, రైతులను ఆదుకోవాలని కోరితే ప్రభుత్వం పారిపోతోందని విమర్శించారు. అసెంబ్లీ ముగిసిన తర్వాత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు కారులో బూర్గుల రామకృష్ణారావు భవన్‌ వరకు వెళ్లి, హఠాత్తుగా కారుదిగి, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంవైపు పరిగెత్తారు. ఆయన వెంట మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. హరీశ్‌రావుతో పాటు ఆయన గన్‌మ్యాన్లు కూడా సెక్రటేరియట్‌వైపు పరుగులు తీసారు. అక్కడ పోలీసులకు హరీశ్‌రావుకు మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం ఆయన్ని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విధించే ఆంక్షలు, తమకు అడ్డుగా పెట్టే ఇనుపకంచెలను లెక్కచేయబోమనీ, రైతులకు అండగా ఉంటామని అన్నారు.

అంతకుముందు గన్‌పార్కు వద్ద కేటీఆర్‌ మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజులు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరంపై వేసింది పీసీ ఘోష్‌ కమిషన్‌ కాదనీ, అది కాంగ్రెస్‌ వేసుకున్న పీసీసీ కమిషన్‌ అని ఎద్దేవా చేశారు. యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్న పదేండ్లలో ఎన్నడూ ఎరువుల కొరత లేదనీ, రైతులు క్యూ లైన్లలో నిలబడాల్సిన దుస్థితి రాలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ సంక్షోభంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో తమకు అనుకూలంగా ఉండే ఒకటి, రెండు అంశాల పైనే మాట్లాడే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాన్ని సభలో పెట్టినా, అన్నింటికీ సరైన సమాధానం ఇస్తామన్నారు. ఇప్పటికే అసమ్మతి ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని, స్పీకర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad