మాగంటి సునీతకే జై అంటున్న స్థానిక ఓటర్లు..
జూబ్లీహిల్స్ రెహమత్ నగర్ డివిజన్ లో బీఆర్ఎస్ ఇంటింటి ఎన్నికల ప్రచారం..
కొత్తూరు మాజీ జెడ్పిటిసి ఎమ్మె శ్రీలత సత్యనారాయణ..
నవతెలంగాణ – కొత్తూరు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు లాంచనమేనని కొత్తూరు మాజీ జడ్పిటిసి ఎమ్మె శ్రీలత సత్యనారాయణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆమె రహమత్ నగర్ డివిజన్ లో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… జూబ్లీహిల్స్ ఓటర్లు సునీతమ్మ వైపే ఉన్నారని ఆమె గెలుపు ఇక లాంచనమేనని అన్నారు. పదేళ్ల కెసిఆర్ పాలనలో స్వర్గీయ గోపీనాథ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని అన్నారు. ప్రచారంలో అన్యుహంగా ఉందని మీరు చెప్పినా చెప్పకపోయినా మా ఓటు కారు గుర్తుకేనని ఓటర్లు గంట పదంగా చెబుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సుమారు 50000 భారీ మెజార్టీతో విజయం సాధించడం పక్కా అని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మిట్టు నాయక్, గోపాల్ నాయక్, జిల్లెల వెంకటరెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగ మండల అధ్యక్షులు కడల శ్రీశైలం, అంబటి కృష్ణయ్య, కుమ్మరిగూడెం పాండు, బుడుగు ఆంజనేయులు తదితరులు ఉన్నారు.
జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు లాంఛనమే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



