Monday, February 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ వార్డు సభ్యులు కన్నుమూత 

బీఆర్ఎస్ వార్డు సభ్యులు కన్నుమూత 

- Advertisement -

పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత 
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్

యాదగిరిగుట్ట మండలం, కాచారం సోమవారం, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు సభ్యులు ఇప్ప శ్రీనివాస్ సోమవారం మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత వారి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీఆర్ఎస్ యువనేత మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామ ప్రజలు యువత శోకసముద్రంలో మునిగిపోయారు. నేతలు కన్నీటి పర్వతం అయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్  ఉపేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కర్రె వెంకటయ్య, మాజీ సర్పంచ్  అరుణ అశోక్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ ఇమ్మడి రాంరెడ్డి, బహుపేట సర్పంచ్ కవిడే మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -