- Advertisement -
- 585 ఓట్ల మెజారిటీతో తురగ సౌజన్య గెలుపు
- నవతెలంగాణ – రాయికల్
- రెండవ దశ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాయికల్ పట్టణంలోని 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి తురగ సౌజన్య ప్రత్యర్థి పై 585 ఓట్ల అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ ఫలితంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
ఫలితాలు వెలువడిన వెంటనే కార్యకర్తలు పట్టణంలోని శివాజీ విగ్రహం వద్ద టపాకాయలు పేల్చి విజయోత్సవాలు నిర్వహించారు.మిఠాయిలు పంచుకుని ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా తురగ సౌజన్య మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచి అత్యధిక మెజారిటీతో గెలిపించిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.వార్డు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.పార్టీ నాయకులు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ..ఈ విజయం ప్రజల ఆశీస్సులు,కార్యకర్తల కృషికి ప్రతిఫలమని పేర్కొన్నారు.
- Advertisement -



