కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు
నవతెలంగాణ – మల్హర్ రావు
అజ్ఞానం, అవివేకంతోనే బిఆర్ఏజ్ నాయకులు అసత్యప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మంగళవారం కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మతి భ్రమించి కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. తమ మానస పుత్రిక అని గొప్పగా చెప్పుకున్న కేసీఆర్ కూలేశ్వరాన్ని నిర్మించి కూల్చేసారని లక్ష కోట్ల ప్రజాధనాన్ని నీళ్లపాలు చేసి దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాల హయాంలోనే కన్నెపెళ్లి పంపు హౌస్ లు నీటిలో మునిగి బాహుబలి మోటార్లు పనికి రాకుండా పోయాయని దానికి పూర్తి బాధ్యత కల్వకుంట్ల కుటుంభమేన్నారు.
జస్టిస్ పినాకిని ఘోష్ తన 650 పేజీల నివేదికను ముగ్గురు ఐఏఎస్ ల బృందం పది అంశాలలుగా విభజించి మొదటి అంశంగా ప్రాజెక్ట్ నిర్మాణ అవక తవకలల్లో మొదటి భాద్యులు కేసీఆర్ అని, తదుపరి హరిష్ రావు, ఈటల రాజేందర్,కొందరు ఐ ఏఎస్,ఇంజినీరింగ్ అధికారులని తన నివేదికలో పొందుపరచడం జరిగిందన్నారు. జస్టిస్ పినాకిని ఘోష్ మొత్తం 166 మందిని విచారించగా ఈ ముగ్గురు ప్రథమ ముద్దాయులని స్పష్టంగా పేర్కొనడం జరిగిందన్నారు. తుమ్మిడి హట్టి నుండి కాళేశ్వరం లోని మెడిగడ్డకు ప్రాజెక్ట్ నిర్మానాన్ని మూడు రెట్లు పెంచిన ఘనత కేసీఆర్ అని దుయ్యబట్టారు. గతంలో సహితం తన మెదడు కరిగించి తన రక్తం ఒక్కొక్క చుక్క ఖర్చుపెట్టి ఈ ప్రాజెక్ట్ ను రూపకల్పన చేసింది తానేనని పత్రిక, మీడియా ముఖంగా ప్రకటించి కేసీఆర్, దోషిని నిరూపనకాగా మాట మార్చి ఈ ప్రాజెక్టు అంత ఇంజనీర్లే కట్టారని మాట మార్చుతున్న కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అవివేకంతోనే బిఆర్ఎస్ అసత్యపు ప్రచారాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES