Monday, February 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరకాల మున్సిపల్ పోరుకు బీఆర్ఎస్ సమరశంఖం

పరకాల మున్సిపల్ పోరుకు బీఆర్ఎస్ సమరశంఖం

- Advertisement -

22 వార్డుల అభ్యర్థుల ప్రకటన
నవతెలంగాణ – పరకాల 

పరకాల మున్సిపాలిటీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పట్టణంలో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి మున్సిపాలిటీలోని మొత్తం 22 వార్డులకు సంబంధించిన పార్టీ అభ్యర్థుల తుది జాబితాను అధికారికంగా ప్రకటించారు.

వార్డుల వారీగా బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే.. 1వ వార్డు నుండి వెంకటస్వామి దుబాసీ, 2వ వార్డులో బొచ్చు శ్యామల బాబురావు, 3వ వార్డులో పంచగిరి సృజన సుమంత్, 4వ వార్డులో కడారి జ్యోతి, 5వ వార్డులో గొడుగు రజిత నాగరాజు, 6వ వార్డులో తుమ్మల రాణి రవి, 7వ వార్డులో దుంపేటి నాగరాజు, 8వ వార్డులో ఆడప రాము, 9వ వార్డులో బండారి కవిత కృష్ణ, 10వ వార్డులో పిట్ట స్వప్న దేవేందర్ పోటీ చేయనున్నారు.

అదేవిధంగా 11వ వార్డు అభ్యర్థిగా మార్త విక్రమ్, 12వ వార్డులో గంట కళావతి వెంకటేశ్వర్లు, 13వ వార్డులో దగ్గు సునీత, 14వ వార్డులో పడిదెల దీప్తి రాకేష్, 15వ వార్డులో కందుకూరి వేణుగోపాలమూర్తి, 16వ వార్డులో బండి సారంగపాణి, 17వ వార్డులో శనిగరం రజిని నవీన్, 18వ వార్డులో రేగూరి కరుణ విజయపాల్ రెడ్డి, 19వ వార్డులో ఏకు బాబు (బొబ్బిలి), 20వ వార్డులో పాలకుర్తి గోపి, 21వ వార్డులో ఒంటేరు చక్రపాణి (చక్రి), 22వ వార్డులో ఇంగిలీ వీరేష్‌లను ఖరారు చేశారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ, గెలుపు గుర్రాలకే చల్లా ధర్మారెడ్డి ప్రాధాన్యతనిచ్చారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అభ్యర్థుల ప్రకటనతో పరకాలలో ఎన్నికల సందడి ఒక్కసారిగా ముమ్మరమైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -