- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సంగారెడ్డిలోని హత్నూర మండలం దౌల్తాబాద్ లో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. ఓ బాలుడిపై సుమారు 20 కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. దీంతో బాలుడు అరుపులు విని ఓ మహిళ బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు చండూరులో ఒకే కుక్క 11 మందిపై దాడి చేయడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. తక్షణమే అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు.
- Advertisement -



