- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సనత్ నగర్ లో శంకర్ (55) అనే హోటల్ కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలో బసవరాజు అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపినట్లు తెలుస్తోంది. గతంలో ఎర్రగడ్డలో నివసించిన శంకర్, పక్క ఇంట్లోని మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం మహిళ భర్త బసవరాజుకు తెలియడంతో గొడవ జరిగింది. అనంతరం శంకర్ ఇల్లు ఖాళీ చేసి భరత్ నగర్ లో ఉంటున్నాడు. చికిత్స పొందుతూ శంకర్ మృతి చెందాడు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
- Advertisement -



