- Advertisement -
నవతెలంగాణ శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని మధురానగర్ స్ట్రీట్ నెంబర్ 3లో గుర్తుతెలియని దుండగులు ఒక యువకుడిని గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీం సహాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు. మృతుడు ఎవరు, హత్యకు గల కారణాలు ఏమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
- Advertisement -



