Tuesday, October 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళ దారుణ హత్య

మహిళ దారుణ హత్య

- Advertisement -

లైంగికదాడి.. ఆపై హత్య చేసిన దుండగులు!
రాజేంద్రనగర్‌ పీఎస్‌ పరిధిలో ఘటన

నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
గుర్తు తెలియని మహిళపై దుండగులు లైంగికదాడి చేసి.. ఆ తర్వాత చంపేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. రాజేంద్రనగర్‌ సీఐ కాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కిస్మత్‌పూర్‌ బ్రిడ్జి కింద నగంగా పడి ఉన్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. హత్య జరిగి మూడ్రోజులు కావొచ్చని, ఎక్కడో ఆమెపై లైంగికదాడికి పాల్పడి, అనంతరం హత్య చేసి ఇక్కడ పడేసి వెళ్లిపోయారని పోలీసులు భావిస్తున్నారు. మహిళ వయసు 25 నుంచి 30 వరకు ఉంటుంది. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఘటనా స్థలంలో క్లూస్‌ టీం, డాగ్స్‌ స్క్యా ర్డ్‌తో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని స్థానికులు ఎవరూ గుర్తించకపోవడంతో సమీప పోలీస్‌ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్‌ కేసులను పరిశీలిస్తున్నారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని సీఐ తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -