Wednesday, February 4, 2026
E-PAPER
Homeక్రైమ్మహిళా న్యాయవాది దారుణ హత్య

మహిళా న్యాయవాది దారుణ హత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో బుధవారం దారుణం జరిగింది. మొయినాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లిలో తన సోదరుడే కత్తితో స్వప్న మెడపై దాడి చేసి చంపిన ఘటన కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో మొయినాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్వప్న చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆమె కుటుంబంలో ఆస్తి గొడవలు ఉన్నట్టు తెలిసింది. ఈ క్రమంలో బుధవారం పొలం వద్ద పంచాయితీ జరుగుతుండగా సోదరుడు స్వప్నను హతమార్చాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -