భవన నిర్మాణంలో పనిచేస్తున్న భార్యాభర్తలు
వలస జీవులను బలిగొన్న గుర్తు తెలియని దుండగులు
క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌లతో పరిశీలన
అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన శేరిలింగంపల్లి జోన్ డీసీపీ శ్రీనివాస్ చింతమనేని
నవతెలంగాణ-పటాన్ చెరు
బతుకుదెరువు కోసం వలసవచ్చి భవన నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద వాచ్ మెన్‌గా జీవనం సాధిస్తున్న భార్యాభర్తలను అతికిరాతంగా ప్రాణాలు తీశారు గుర్తు తెలియని దుండగులు. వాచ్‌మెన్ దంపతుల దారుణ హత్యతో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పారిశ్రామిక వాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబబాద్ జిల్లా గూడూర్ మండలం దొంగచింత తండాకు చెందిన సోమ్లా దశరథ్(50) మాన్యమ్మ(45) దంపతులు జీవనోపాధి కోసం మూడున్నర సంవత్సరాల క్రితం సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ లోని సిటిజెన్ కాలని లోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో వాచ్‌మెన్‌గా చేరి భవనం పక్కనే గుడిసె వేసుకొని నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి గుడిసెలో పడుకున్న దంపతులిద్దరిని గుర్తు తెలియని దుండగుల తలలపై అతి కిరాతకంగా కొట్టి హత్య చేశారు.
శనివారం ఉదయం పనుల కోసం వచ్చిన నిర్మాణ సిబ్బంది, దంపతులు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శేర్లింగంపల్లి డిసిపి చింతమనేని శ్రీనివాస్, రామచంద్రాపురం ఏసిపి శ్రీనివాస్ కుమార్, సీఐ వినాయక్ రెడ్డి, ఎస్సైలు రాజు, విద్యా చరణ్ రెడ్డి లు ఘటనాస్థలికి చేరుకుని పూర్వపరాలను పరిశీలించారు. వెంటనే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ల సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులకు ఇద్దరు కూతుళ్లు కాగా పెద్ద కూతురికి వివాహం కాగా చిన్న కూతురు హాస్టల్ లో ఉంటూ పదవ తరగతి చదువుతోంది. శేర్లింగంపల్లి డిసిపి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
వాచ్‌మెన్ దంపతుల దారుణ హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



