- Advertisement -
నవతెలంగాణ – జనగామ
జిల్లా జఫర్ గడ్ మండలంలోని తమ్మడపల్లి (ఐ) గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరి మహిళలను దారుణంగా హత్య చేసే సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తల్లి కూతుర్లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన ఘటన ఆస్తి తగాదాలని గ్రామస్తులు అనుకుంటున్నారు.
- Advertisement -