నవతెలంగాణ-విలేకరులు
బీఎస్‌ఎన్‌ఎల్ 25వ వార్షికోత్సవ వేడుకలను బుధవారం పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. స్వదేశీ బీఎస్‌ఎన్‌ఎల్ పేరిట ప్రతి మారుమూల గ్రామానికి నెట్‌వర్క్ సేవలను అందించే లక్ష్యంగా తాము పని చేస్తున్నామని బీఎస్‌ఎన్‌ఎల్ ఆదిలాబాద్ జిల్లా ఏజీఎం సీతారాం అన్నారు. కార్యాలయంలో సంస్థ వేడుకల్లో ఆయన మాట్లాడారు. సంస్థ లక్ష్యాలను వివరించారు. ప్రతి మారుమూల పల్లెకూ తమ సేవలను విస్తరించేలా పని చేయాలని ఉద్యోగులకు సూచించారు. ప్రతి పల్లెకూ నెట్‌వర్క్ అందించాలనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వదేశీ బీఎస్‌ఎన్‌ఎల్ ప్రాజెక్టు చేపట్టారని, దానికి అనుగుణంగా ఆదిలాబాద్ జిల్లాలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, ఆ పనులు డిసెంబర్ చివరి నాటిని పూర్తి చేస్తామన్నారు.
ప్రజలు బీఎస్‌ఎన్‌ఎల్ సేవలను వినియోగిస్తూ సంస్థను ఆదరించాలని కోరారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టెలిఫోన్ భవన్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ రజతోత్సవ వేడుకలు జరిపారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రోడ్ షో నిర్వహించారు. అనంతరం బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులను సన్మానించారు.బీఎస్‌ఎన్‌ఎల్ 25వ వార్షికోత్సవం వేడుకలను జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఆటపాటలు ఉత్సవాలను నిర్వహించారు.
ఘనంగా బీఎస్‌ఎన్‌ఎల్25వ వార్షికోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES