Tuesday, November 11, 2025
E-PAPER
Homeజాతీయంజియోకు బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌…

జియోకు బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌…

- Advertisement -

ఇంట్రా సర్కిల్‌ రోమింగ్‌కు ఒప్పందం
న్యూఢిల్లీ : ప్రభుత్వ టెలికం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌తో రిలయన్స్‌ జియో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా జియో కవరేజీ లేని మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో బిఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ను వినియోగించుకోనుంది. ఈ ఇంట్రా సర్కిల్‌ రోమింగ్‌ను ప్రస్తుతానికి మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ వినియోగదారులకు జియో అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం జియో ఇంట్రా సర్కిల్‌ రోమింగ్‌ (ఐసీఆర్‌) రీచార్జి ప్లాన్లను ప్రవేశపెట్టింది. 28 రోజుల గడువుతో వస్తున్న ఈ ప్లాన్ల ధరలను రూ.396, రూ.196గా నిర్ణయించింది. ఈ ప్లాన్లు జియో సిగల్‌ పూర్తిగా లేని సందర్భంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ను ఎంచుకున్నప్పుడు మాత్రమే పని చేస్తాయి. ఇతర ప్రాంతాల్లోనూ ఈ ఐసీఆర్‌ సేవలను అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిగల్‌ సమస్యకు పరిష్కారంగా ఈ ఏడాది జనవరిలో ట్రారు ఇంట్రా సర్కిల్‌ రోమింగ్‌ సదుపాయాన్ని ప్రకటించింది. దీంతో జియో, ఎయిర్‌టెల్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు తమ సొంత సెల్యులార్‌ టవర్ల పరిధిలో లేనప్పటికీ ఇతర టెలికం నెట్‌వర్క్‌లను వినియోగించుకోవడానికి వీలుంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -