Wednesday, October 1, 2025
E-PAPER
Homeఆటలుబుచ్చిబాబు విజేత హైదరాబాద్‌

బుచ్చిబాబు విజేత హైదరాబాద్‌

- Advertisement -

చెన్నై : ఆల్‌ ఇండియా బుచ్చిబాబు టోర్నమెంట్‌ విజేతగా హైదరాబాద్‌ నిలిచింది. చెన్నైలోకి సూపర్‌కింగ్స్‌ గ్రౌండ్స్‌లో జరిగిన ఫైనల్లో తమిళనాడు ప్రెసిడెంట్‌ ఎలెవన్‌పై హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో పైచేయి సాధించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 115.4 ఓవర్లలో 376/10 పరుగులు చేయగా, తమిళనాడు 138.2 ఓవర్లలో 353/10 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌ విలువైన 23 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌ 70 ఓవర్లలో 155/5 పరుగులు చేసింది. నాలుగు రోజుల అనంతరం ఫలితం తేలే అవకాశం లేకపోవటంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -