నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి గురువారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. 2002 బ్యాచ్‌కు చెందిన ఆయన తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా పని చేశారు. రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శిగా విశిష్ట సేవలు అందించారు. అంతకుముందు సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో కూడా వివిధ హోదాల్లో పని చేశారు.
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా, భద్రాద్రి కొత్తగూడెం ఐటిడిఏ పీఓగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటి వరకు సింగరేణి తాత్కాలిక సీఎండీగా వ్యవహరించిన కృష్ణభాస్కర్ యదావిధిగా ట్రాన్స్‌కో సీఎండీగా కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఎల్‌వి.సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, గౌతం పొట్రు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వెంకన్న, జనరల్ మేనేజర్ తాడబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన బుద్దప్రకాశ్ జ్యోతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



