- Advertisement -
నవతెలంగాణ – తుంగతుర్తి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ అంకెల గారడీ… మాటల గారడీ.. తప్ప, ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా ఉందని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రైతు రుణమాఫీ, 6 గ్యారంటీల అమలుకు బడ్జెట్లో స్పష్టమైన కేటాయింపులు లేవని ఇది ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. బడ్జెట్ పేదలకు సామాన్యులకు భారంపడేలా ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి స్కాంలు తప్ప స్కీములు తెలియదని విమర్శించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను తీవ్ర నిరాశపరచిందన్నారు.
- Advertisement -


