- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
మండలంలోని తపాలపురం గ్రామానికి చెందిన రైతు మందపల్లి శంకరయ్యకు చెందిన గేదె విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందింది. ఉదయం రైతు శంకరయ్య తన గేదెను మందలోకి వెళ్తున్న సమయంలో కమల విజయ ధర్మ ఇంటి సమీపాన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఈ ఘటన జరిగిందని రైతు తెలిపారు. విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన గేదెను మండల ప్రభుత్వ పసి వైద్యాధికారి డాక్టర్ కస్తూరి శ్రీకాంత్ పోస్టుమార్టం చేశారు. మృతిచెందిన గేద విలువ దాదాపు లక్ష యాభై వేల రూపాయలు ఉంటుందని, వారు తెలిపారు. ప్రభుత్వం విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వెంటనే విద్యుత్ ఘాతానికి మృతిచెందిన గేదెకు నష్టపరిహారం ఇవ్వాలని రైతు శంకరయ్య కోరుతున్నామన్నారు.
- Advertisement -



