ఆడబిడ్డలంటే మహాలక్ష్మి లు
సమస్యలకు సుశీలమ్మ ఫౌండేషన్ భరోసా
పదవుల కంటే ప్రజలే ముఖ్యం
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నవతెలంగాణ-మర్రిగూడ
నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయిలో విద్యావ్యవస్థను నిర్మిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో 1 కోటి 50 లక్షల రూపాయల తన సొంత నిధులతో నిర్మించిన (9 అదనపు తరగతి గదులు,36 బాత్రూంలు,ప్లే గ్రౌండ్,ప్రహరీ గోడ) ను కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మితో ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ మునుగోడు ప్రజలందరిదీ విద్య,వైద్యంలోనే కాదు ఏ సమస్య వచ్చిన సుశీలమ్మ పౌండేషన్ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా 10 వేల మందికి కంటి పరీక్షలు చేయించి,1500 మందికి ఆపరేషన్లు చేయించామని తెలిపారు.
గత రెండు నెలల క్రితం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలకు వచ్చినప్పుడు పాఠశాల సమస్యలను విద్యార్థులు చెబుతుంటే చాలా బాధేసిందని అప్పుడే ఊహించని రీతిగా పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.నియోజకవర్గంలోని 18 రెసిడెన్షియల్ పాఠశాలను కూడా మోడరన్ పాఠశాలలుగా తీర్చిదిద్దుతానన్నారు.నేటి విద్యార్థులే రేపటి భవిష్యత్తు దిక్సూచి అని వీరికి ఎంత చేసిన తక్కువే అన్నారు.విద్యార్థులకు చదువుతోపాటు క్రమశిక్షణ,సమాజం పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులది అన్నారు.విద్యార్థులు కూడా చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రమశిక్షణతో చదువుకొని మంచి ప్రయోజకులు కావాలని సూచించారు.
పాఠశాలలో ఉన్న 14 మంది సిబ్బందికి తక్కువ వేతనం వస్తున్నందున ప్రభుత్వం ఇచ్చే జీతంతో పాటు వారికి జీతం పెరిగే వరకు సుశీలమ్మ ఫౌండేషన్ తరపున ప్రతినెల 5000 రూపాయలు వారి అకౌంట్లో వేస్తామని చెప్పారు.అనంతరం ఆయన విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి వారితో పాటు సహపంక్తి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి,సివిల్ ఇంజనీర్ శివాజీ,ఎంఈఓ బిట్టు శ్రీనివాస్,కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్నమనేని రవీందర్రావు,మాల్ మార్కెట్ వైస్ చైర్మన్ నక్క శ్రీనివాస్ యాదవ్,మాజీ జెడ్పిటిసి లు పాశం సురేందర్ రెడ్డి,మేతరి యాదయ్య,మాజీ సర్పంచులు,ఎంపీటీసీలు,కాంగ్రెస్ మండల నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్ స్థాయిలో విద్యావ్యవస్థను నిర్మిస్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES